కరోనాను ఉతికారేసిన సెంచరీ బామ్మ..

దిశ,జగిత్యాల : రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వ్యాధి బారిన వారు వైరస్ నుంచి కోలుకుని అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండగా, కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన చెన్నమనేని ఆండాలు (104) కరోనాను జయించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల ఆమెకు కరోనా టెస్టు నిర్వహించగా పాజిటివ్ రావడంతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన […]

Update: 2021-06-23 12:01 GMT

దిశ,జగిత్యాల : రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వ్యాధి బారిన వారు వైరస్ నుంచి కోలుకుని అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండగా, కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన చెన్నమనేని ఆండాలు (104) కరోనాను జయించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇటీవల ఆమెకు కరోనా టెస్టు నిర్వహించగా పాజిటివ్ రావడంతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆత్మస్థైర్యం, వైద్యుల సూచనలతో 104 ఏండ్ల వృద్దురాలు కరోనాను జయించి ఎట్టకేలకు ఆరోగ్యంగా బుధవారం డిశ్చార్జ్ అయ్యింది. విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి ఆ బామ్మను పరామర్శించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డా.రామకృష్ణను అడిగి ఆండాలు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే వెంట బోర్నపల్లి నాయకుడు రాజు, రూరల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

Tags:    

Similar News