భక్తుల ఆందోళన.. TTD వెయ్యి టోకెన్ల జారీ!

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(TTD) స్వామి వారి సర్వదర్శనం కోసం ఆదివారం 1000టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా రద్దుచేసింది. కరోనా నేపథ్యంలో ఈనెల 30వరకు ఉచిత దర్శనం టోకెన్లను రద్దు చేయడంతో.. ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల నిలిపివేతపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అలిపిరి వద్ద శనివారం అర్ధరాత్రి వరకు భక్తులు ఆందోళన నిర్వహించారు .మరోవైపు రాత్రంతా భక్తులు […]

Update: 2020-09-05 21:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(TTD) స్వామి వారి సర్వదర్శనం కోసం ఆదివారం 1000టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా రద్దుచేసింది. కరోనా నేపథ్యంలో ఈనెల 30వరకు ఉచిత దర్శనం టోకెన్లను రద్దు చేయడంతో.. ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల నిలిపివేతపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో అలిపిరి వద్ద శనివారం అర్ధరాత్రి వరకు భక్తులు ఆందోళన నిర్వహించారు .మరోవైపు రాత్రంతా భక్తులు క్యూలైన్లలోనే పడిగాపులు కాచారు. భక్తుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఎట్టకేలకు TTD దిగొచ్చింది. ఇవాళ స్వామి వారి సర్వదర్శనం కోసం వెయ్యి ఉచిత టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో భక్తులు శాంతించారు.

Tags:    

Similar News