జేసీ ట్రావెల్స్ పై రూ.100 కోట్ల జరిమానా?
తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. అంతేకాకుండ జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయితే దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 […]
తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. అంతేకాకుండ జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయితే దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. అయితే వీటిని స్క్రాబ్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని ప్రసాదరావు వెల్లడించారు.