ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది కోవిడ్ రోగులు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 10 మంది కరోనా రోగులు మరణించారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఆస్పత్రిలోని ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో 25 మంది రోగులు చేరారు. వారిలో ఆరుగురు గాయపడ్డారు. అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే 10 మంది కోవిడ్ -19 రోగుల మరణాన్ని ధృవీకరించారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక విభాగం […]

Update: 2021-11-06 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 10 మంది కరోనా రోగులు మరణించారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఆస్పత్రిలోని ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో 25 మంది రోగులు చేరారు. వారిలో ఆరుగురు గాయపడ్డారు. అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే 10 మంది కోవిడ్ -19 రోగుల మరణాన్ని ధృవీకరించారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక విభాగం చీఫ్ శంకర్ మిసాల్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News