బిల్ గేట్స్ చదవమంటున్న ఆ 10 పుస్తకాలివే..
దిశ, వెబ్ డెస్క్: బిల్ గేట్స్‌కు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కిడికెళ్లినా.. వెంట పుస్తకాలు ఉండాల్సిందే. అయితే బిల్ గేట్స్ కొన్ని సంవత్సరాల నుంచి పుస్తక ప్రేమికులతోపాటు మిగతా వారికి కూడా ఓ సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు. ప్రతి వేసవికాలంలో కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి, వాటిని తప్పనిసరిగా చదవాలని సూచిస్తున్నారు ఆయన. ఈ ఏడాది కూడా ఓ పది పుస్తకాలను తన లిస్ట్‌లో చేర్చారు. ద చాయిస్: ఎడిత్ ఎవా ఎగర్స్ రాసిన […]
దిశ, వెబ్ డెస్క్: బిల్ గేట్స్‌కు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కిడికెళ్లినా.. వెంట పుస్తకాలు ఉండాల్సిందే. అయితే బిల్ గేట్స్ కొన్ని సంవత్సరాల నుంచి పుస్తక ప్రేమికులతోపాటు మిగతా వారికి కూడా ఓ సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు. ప్రతి వేసవికాలంలో కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి, వాటిని తప్పనిసరిగా చదవాలని సూచిస్తున్నారు ఆయన. ఈ ఏడాది కూడా ఓ పది పుస్తకాలను తన లిస్ట్‌లో చేర్చారు.
ద చాయిస్: ఎడిత్ ఎవా ఎగర్స్ రాసిన ‘ద చాయిస్’ పుస్తకం అంతర్జాతీయంగా చాలా పేరొందింది. ఈ పుస్తకం చదివితే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవచ్చు. ‘ద చాయిస్ విల్ బీ ఎన్ ఎక్స్‌ట్రార్డినరీ బుక్ ఆన్ హీరోయిజం, హీలింగ్, కంపాషన్, సర్వైవల్ విత్ డిగ్నిటీ, మెంటల్ థాట్‌నెస్ అండ్ మోరల్ కరేజ్’ అని స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ ఫిలిప్ అభివర్ణించారు.
క్లౌడ్ అట్లాస్: ఈ పుస్తకంలో ఆరు ఇంటర్ రిలేటెడ్ స్టోరీస్ ఉన్నాయి. అవి డిఫరెంట్ టైమ్స్‌లో, డిఫరెంట్ లోకేషన్స్‌లో సంభవిస్తాయి. ఈ పుస్తకాన్ని డేవిడ్ మిచెల్ రచించారు.
ద రైడ్ ఆఫ్ ఏ లైఫ్ టైమ్: ఈ పుస్తకం ఫార్మర్ డిస్నీ సీఈవో రాబర్ట్ ఈగర్ జీవిత చరిత్రకు సంబంధించింది.
ద గ్రేట్ ఇన్‌ఫ్లూయంజా: దీన్ని జాన్ ఎమ్ బేరీ రాశారు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ గురించి ఈ పుస్తకంలో వివరించారు.
గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్: అభిజిత్ వి బెనర్జీ, ఎస్టర్ డఫ్లో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ప్రధానంగా ధనిక దేశాల పాలసీ డిబేట్స్‌ను ప్రస్తావించారు.
ఇంకా ఈ లిస్టులో ‘ద హెడ్ స్పేస్ గైడ్ టు మెడిటేషన్ అండ్ మైండ్ ఫుల్‌నెస్, మూన్ వాకింగ్ విత్ ఐన్‌స్టీన్, జాషువా ఫోయిర్, ద రోసీ ప్రాజెక్ట్, ద బెస్ట్ వి కుడ్ డూ, హైపర్‌బోలా అండ్ ఏ హాఫ్’ వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి.