నేషనల్ మీడియాపై బిగ్‌ బీ ఫైర్

by Shyam |
నేషనల్ మీడియాపై బిగ్‌ బీ ఫైర్
X

బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జులై 11న తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన సీనియర్ బచ్చన్.. తన కుటుంబం మొత్తానికి పరీక్షలు జరిగాయని, ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అభిషేక్ బచ్చన్‌కు పాజిటివ్ అని ప్రకటించగా.. తర్వాతి రోజు ఐశ్వర్య రాయ్, ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చిందని తేలింది. ప్రస్తుతం నలుగురు కూడా అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారంతా ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తుండగా.. వారి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కానీ, నేషనల్ మీడియా ఇంకొంచెం ముందుగా అలోచించి ఏకంగా అమితాబ్‌కు కరోనా నెగెటివ్ అని ప్రకటించింది. దీనిపై మండిపడిన అమితాబ్ జీ.. ఈ వార్త ఫేక్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నట్లుగా ట్వీట్ చేశారు బచ్చన్. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం సరికాదన్నారు.

Advertisement

Next Story