- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా చింటుకు సాటి లేరు.. రారు : అమితాబ్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. దాదాపు రెండు నెలలు పూర్తవుతున్నా.. తన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ‘రొమాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన మా చింటూ.. నాకెప్పటికీ ప్రత్యేకమే. నటుడిగా ఎన్నో రొమాంటిక్ మూవీస్ చేసిన రిషి ‘లిప్ సింక్’ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ విషయంలో తనను రీప్లేస్ చేసే నటుడే లేడు’ అంటూ తన స్నేహితుడిని స్మరించుకుంటూ కీర్తించాడు బిగ్ బీ.
ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్‌లతో కలిసి స్టేజ్‌పై పర్ఫార్మెన్స్ ఇస్తున్న రిషి ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన బిగ్ బీ.. ‘తన ఎక్స్‌ప్రెషన్‌లో పాషన్ చూడండి.. ఎంత గొప్పగా ఉందో కదా’ అని గుర్తుచేసుకున్నాడు. ‘ఈ వయసులోనూ.. అది కూడా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్‌లో ఎంతలా లీనమై ఎంజాయ్ చేస్తున్నాడో కదా..’ మా రిషి అంతే మరి అంటున్నాడు.
శుక్రవారం అమితాబ్ బచ్చన్ ‘గులాబో సితాబో’ మూవీ డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా.. మరోసారి బచ్చన్ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కాగా ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా మరో ప్రధాన పాత్రలో కనిపించాడు.