బిగ్‌ బీ ప్రేమ పెళ్లి @ 47

by Shyam |   ( Updated:2020-06-03 01:19:44.0  )
బిగ్‌ బీ ప్రేమ పెళ్లి @ 47
X

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల జోడీ.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్‌’‌లా ఉంటుంది. అయితే రీల్ లైఫ్‌లో కపుల్స్‌గా కనిపించిన వీరు రియల్ లైఫ్ కపుల్స్ ఎలా అయ్యారు? ముందుగా ఎవరిని చూసి ఎవరు ఇంప్రెస్ అయ్యారు ? అంటే.. అఫ్‌కోర్స్ నేనేనని చెబుతుంటారు జయా బచ్చన్. 1970లో పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఆరడగుల యాంగ్రీ యంగ్‌మ్యాన్ బిగ్‌బీని చూసినప్పుడే పడిపోయిందట జయ. అప్పటికే జయ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోగా.. అమితాబ్ మాత్రం ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా కష్టపడుతున్నాడట. ఇదిలా ఉంటే, జయను గ్లోసీ అనే కవర్ పేజీపై చూసిన బిగ్‌ బీ.. ఆమె అందానికి దాసోహం అయ్యారట. మోడ్రన్ లుక్స్, సాంప్రదాయం కలగలిసిన జయాజీ అందం బచ్చన్‌కు తెగ నచ్చేసిందట.

మొత్తానికి ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఇష్టపడుతున్న టైమ్‌లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ సినిమాలో ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించిందట. ఆ సెట్స్‌లో తనను చూసి మరింత ఇంప్రెస్ అయిన జయ.. తను అందరికన్నా చాలా ప్రత్యేకం, ఖచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడని తోటి నటులతో చెప్పగా అందరు నవ్వేశారట. కానీ అది చేసి చూపించిన బిగ్‌బీని చూసి ప్రేమలో పడేందుకు ఎక్కువ కాలం పట్టలేదని చెప్తుంటుంది జయ. జయ అప్పటికే తనతో ప్రేమలో ఉన్నానని నిర్ధారించుకోగా.. ఏక్ నజర్ సినిమా సమయంలో జయతో లవ్‌ కన్‌ఫర్మ్ చేసుకున్నారట బిగ్‌బీ. ఇక జంజీర్ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు సినిమా సక్సెస్ అయితే ఫ్రెండ్స్‌తో కలిసి లండన్ వెళ్దామని ప్లాన్ వేశారట. కానీ అందుకు నిరాకరించిన బచ్చన్ తల్లిదండ్రులు.. జయకు మూడుముళ్లు వేస్తేనే టూర్‌కు వెళ్లాలని డిసైడ్ చేశారట. ఆ విషయాన్నే తన 47వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా పంచుకున్నారు బిగ్‌బీ.

జూన్ 3, 1973లో అభిషేక్, జయా బచ్చన్‌లు వివాహబంధంతో ఒకటవ్వగా.. ఈ బంధాన్ని బంధించాలనే ఆలోచన మాత్రం సీనియర్ బచ్చన్ తండ్రి హరివంశ్ బచ్చన్‌దేనట. జయ, బిగ్‌ బీ నటించిన జంజీర్ చిత్రం 1973 మే 11న రిలీజ్ కాగా.. ఈ సినిమా సక్సెస్ అయితే కొంత మంది ఫ్రెండ్స్‌తో కలిసి లండన్ వెళ్లాలని డిసైడ్ అయ్యారట అమితాబ్. కానీ ఎవరెవరు వెళ్తున్నారని తండ్రి అడగ్గా.. జయతో పాటు మరికొంత మంది స్నేహితుల పేర్లు చెప్పారట. దీంతో నువ్వు టూర్ వెళ్లేముందు జయను పెళ్లి చేసుకోవాలని ఆదేశించాడట తండ్రి. లేదంటే లండన్ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పాడట. దీంతో తండ్రి నిర్ణయానికి ఓకే చెప్పిన బిగ్‌బీ.. జూన్ 3న జయతో పెళ్లి పీటలెక్కారట. ఇది బిగ్‌ బీ, జయల ప్రేమ పెళ్లి కథ కాగా.. యానివర్సరీ సందర్భంగా వీరిద్దరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

Advertisement

Next Story