సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్!

by srinivas |
సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్!
X

దిశ, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో లాక్‌డౌన్ పరిణామాలు, దానికి అనుసరించాల్సిన తగిన వ్యూహాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌లో సంభాషించారు. ఏప్రిల్ 20 తర్వాత కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపులపై సీఎమ్‌తో సమీక్షించారు. అలాగే, కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి..హోమ్‌మంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు, ప్రతి పదిలక్షల జనాభాకు అత్యధిక పరీక్షలు జరుపుతున్నట్టు, తద్వారా ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 1097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 31కి చేరింది. ముఖ్యంగా కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉంది.

Tags: cm jagan, ap cm, home minister, amit shah

Advertisement

Next Story

Most Viewed