అమీర్‌ఖాన్ కొడుకు విషయంలో అలా చేశాడా?

by Shyam |
అమీర్‌ఖాన్ కొడుకు విషయంలో అలా చేశాడా?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో నెపోటిజం గురించి చర్చ జరుగుతుంది. వారసత్వం హిందీ ఇండస్ట్రీని ఏలుతుందని.. బయట నుంచి వచ్చే యంగ్ టాలెంట్ కు ప్లేస్ దొరకడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ టైమ్‌లో తను మాత్రం వారసత్వాన్ని ప్రోత్సహించడంలో అసలు సపోర్ట్ చేయనని నిరూపించాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.

మలయాళం సూపర్ హిట్ మూవీ ‘ఇష్క్’ సినిమా రిమేక్ గురించి ఆడిషన్స్ జరిగాయి. ఈ ఆడిషన్స్‌లో అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ కూడా పాల్గొన్నాడు. హీరో క్యారెక్టర్ కోసం షార్ట్ లిస్ట్‌లో కూడా ప్లేస్ సంపాదించాడు. కానీ, ఫైనల్ మాత్రం కాలేకపోయాడు. బాండిష్ బండిట్స్ సిరీస్ ఫేం రిత్విక్ భౌమిక్ కథానాయకుడిగా ఎంపికయ్యాడట. నార్మల్‌గా అయితే సూపర్‌స్టార్ అమీర్ ఒక్క ఫోన్ కాల్ చేసి తన కొడుకుని ఫైనల్ చేయాలని చెప్తే కథ వేరేలా ఉండేది. కానీ, అలా చేయడలుచుకొలేదట అమీర్. ఎందుకలా చేశారు సపోర్ట్ చేసి ఉండాల్సింది కదా అని ప్రశ్నిస్తే..పిల్లలకు ఏం కావాలో అది ఇచ్చాం.. ఏం కోరుకున్నారో అది నేర్పించాము..ఆ తర్వాత లైఫ్‌ను డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత వారిదే అని చెప్పారట అమీర్. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ నిజంగా అమీర్‌ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ కదా అంటున్నారు.

Advertisement

Next Story