- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా జైళ్లలో 3వేలకు పైగా ఖైదీలకు కరోనా
వాషింగ్టన్: చైనా, యూరోప్ దేశాల తర్వాత కరోనాకు కేంద్ర బిందువుగా మారిన అమెరికాలో ఇప్పడు సరికొత్త ముప్పును ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని జైళ్లలో ఖైదీలకు కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. న్యూయార్క్ నగరం తర్వాత కాలిఫోర్నియాలో కరోనా విస్తరించడం మొదలు పెట్టిన తర్వాత అధికారులు జైళ్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాలిఫోర్నియాలోని జైలు ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 792 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో అన్ని జైళ్లలో కరోనా పరీక్షలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 70 శాతం మంది ఖైదీలు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. కేవలం ఖైదీలే కాకుండా జైలు సిబ్బందికి కూడా కోవిడ్-19 సోకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జైలులో కరోనా గుర్తించిన వెంటనే అమెరికా ఫెడరల్ ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్ పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించగా 3,300 మందికి కరోనా ప్రబలినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ టెస్టులు అన్నీ ఫెడరల్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జైలులో ఖైదీలకు కరోనా నేపథ్యంలో అధికారులు భౌతిక దూరం, ఐసోలేషన్ వంటి ప్రక్రియలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఖైదీల బంధువుల నుంచి వారిని విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నా.. ప్రస్తుతానికైతే వాటిని పెండింగ్‌లో ఉంచారు.