మందులు పంపించకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం

by Shamantha N |
మందులు పంపించకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం
X

న్యూఢిల్లీ : భారత్.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ పంపించకుంటే అమెరికా ప్రతీకార చర్యలకు పూనుకోవాల్సి ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కొవిడ్ 19 చికిత్సలో కీలకంగా భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ఎగుమతులను భారత్ రెండు వారాల క్రితమే నిషేధించింది. ఈ నేపథ్యంలో కొవిడ్ 19 ఎదుర్కొనేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్ధవంతమైనదని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఆ డ్రగ్ తమ దేశానికి పంపించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆదివారం కోరారు. సోమవారం వైట్ హౌస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందుల ఎగుమతులను నిషేధించే భారత నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ నిర్ణయం నాకు నచ్చలేదు. ఆ నిర్ణయం మోడీ తీసుకున్నాడనుకోవట్లేదు. ఇతర దేశాలకు ఔషధాల ఎగుమతిని భారత్ నిలిపేసింది. మోడీతో నిన్న మాట్లాడాను. మా మధ్య మంచి సంభాషణ జరిగింది. ఆ మందులను అమెరికాకు పంపిస్తే బావుంటుందని చెప్పాను. దశాబ్దాలుగా అమెరికాతో వాణిజ్యం పై భారత్ లబ్ది పొందుతున్నది. ఇప్పుడు ఒకవేళ అమెరికాకు డ్రగ్ సరఫరాకు ఆయన అంగీకరించకుంటే.. సరే.. కానీ దానికి తగిన ప్రతీకార చర్యలు ఉండే అవకాశం ఉంది. ప్రతీకార చర్యలు ఎందుకు ఉండొద్దు’ అని ఆయన ప్రశ్నించారు.

ఇలాంటి బెదిరింపులు చూడలేదు : శశి థరూర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యను కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ విమర్శించారు భారత్ ఔషధాలను సరఫరా చేయకుంటే ప్రతీకార చర్య లను ఆలోచించాల్సి ఉంటుందని చేసిన హెచ్చరికలను తప్పు పట్టారు ప్రపంచ వ్యవహారాల్లో దశాబ్దాలుగా నాకున్న అనుభవంలో ఇటువంటి బెదిరింపులను చూడలేదని తెలిపారు ఒక దేశాధినేత మరో దేశాన్ని బహిరంగంగా బెదిరించడం ఆందోళనకరమైన ట్వీట్ చేశారు.

Tags: Coronavirus, export, hydrixy chloroquine, US, donald trump

Advertisement

Next Story