ఆ సాయం రాబిన్ హుడ్ దేమో.. నాది కాదు: అమీర్

by Jakkula Samataha |
ఆ సాయం రాబిన్ హుడ్ దేమో.. నాది కాదు: అమీర్
X

అమీర్ ఖాన్… బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. సినిమాల్లో సరికొత్త ప్రయోగాలు చేసి సరైనోడు అనిపించుకునే అమీర్ ఖాన్… కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు కూడా సరికొత్తగా ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య ఢిల్లీలోని ఓ ప్రాంతంలో గోధుమ ప్యాకెట్లలో రూ. 15 వేల రూపాయలు పెట్టి పంచారని న్యూస్ వచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలోనూ వైరల్ కాగా… దీనిపై క్లారిటీ ఇచ్చారు మిస్టర్ ఖాన్.

ఒకవేళ సహాయం చేయాలి అనుకుంటే పేరు చెప్పి మరీ… డైరెక్ట్ గా చేస్తాను కానీ.. ఇలా ఎందుకు చేస్తాను అని తెలిపాడు. రాబిన్ హుడ్ లాంటి వ్యక్తి తన పేరు బయిటకు రాకుండా ఈ సహాయం చేసి ఉంటాడేమో అని చెప్పాడు. అంతే కానీ ఈ పని నాది మాత్రం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనతో అమీర్ పై మరింత గౌరవం పెరిగింది అంటున్నారు నెటిజన్లు. ఎవరో చేసిన పనికి తనకు మంచి పేరు వస్తుందని… ఆ క్రెడిట్ తన అకౌంట్ లో వేసుకోకుండా… ఆ మంచి పని చేసింది నేను కాదు అని చెప్పడం గొప్ప విషయం అన్నారు. మరోసారి అమీర్ మిస్టర్ పెర్ఫెక్ట్ అనిపించుకున్నాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరి ఆ రాబిన్ హుడ్ అమీర్ కాకపోతే… మరెవరై ఉంటారు?. అసలు అజ్ఞాతంలో తనుండి… ఇలాంటి సహాయం అందించాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags : Ameer Khan, Bollywood, Help, CoronaVirus, Covid19, Delhi

Advertisement

Next Story