పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కౌంటర్.. నీకా అర్హత లేదంటూ ఫైర్

by srinivas |
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కౌంటర్.. నీకా అర్హత లేదంటూ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీక్ష విరమణ అనంతరం పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కామెంట్స్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు పవన్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. పవన్ ఏది మాట్లాడిన ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఆయన వైఖరి ఉంటుందన్నారు. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్నానని చెప్పిన పవన్.. తన ప్రసంగంలో అసలు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

బీజేపీతో పార్ట్నర్‌గా ఉండి ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడవా? అని అంబటి అడిగారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారన్నారు. కేంద్రం అప్పు రూ.121 కోట్ల లక్షలు ఉందని.. అయితే, దేశాన్నీ కూడా అమ్మేయాలంటారా? అని అడిగారు. 1972లో దామోదరం సంజీవయ్య చనిపోతే పవన్‌కు ఇప్పుడు గుర్తొచ్చారా? అని విమర్శించారు. రాజకీయాల్లో వారసత్వానికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగిస్తున్నారని అందుకే తనకు ప్రధాని అంటే ఇష్టమని పవన్ అంటున్నారు. వారసత్వం అనేది రాజకీయాల్లోనే మీకు నచ్చదా? సినిమాల్లోనూ నచ్చదా? అని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు.. ఇక రాజధాని గురించి పవన్ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయారా? అంటూ అడిగారు. జనసేను అధికారంలోకి తీసుకురావాలని అడిగే హక్కు పవన్ కు లేదన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని మేము కూడా చెబుతున్నాం.. అది కేంద్ర ప్రభుత్వ ఆస్తి.. కేంద్రంతో దోస్తీ చేస్తున్న పవన్‌కు ప్రైవేటీకరించొద్దని అడిగే ధైర్యం లేదా అంటూ విమర్శించారు. మిత్రులకు అడిగే ధైర్యం లేనివారికి ఈ దీక్షలు ఎందుకంటూ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed