- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగో స్థానానికి ముఖేష్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani, Chairman, Reliance Industries Limited) సంపన్నుల జాబితా (wealthiest list)లో మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ ఏడాది 22 బిలియన్ డాలర్ల ($ 22 billion)ను కూడబెట్టి 80.6బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే నాలుగో అపర కుబేరుడి(world’s, fourth-richest man)గా ఆయన ఎదిగారు.
ఇప్పటి వరకు నాలుగోస్థానంలో ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారదిగ్గజం,(Business tycoon from France), లగ్జరీ వస్తువులను తయారుచేసే ఎల్‌వీఎంహెచ్ మోయెట్ హెనెస్సీ లూయిస్ వుట్టన్ ఎస్ఈ(LVMH Moet Hennessy Louis Vuitton SE)కు వినియోగదారుల నుంచి దెబ్బపడింది. కరోనా కారణంగా వ్యాపారం సాగలేదు.
కంపెనీ వ్యయాన్ని(cost) తగ్గించుకునేలోపే వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించేసుకున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఎల్‌వీఎంహెచ్ షేర్లు(Shares)భారీగా పడిపోయాయి. ప్రపంచ 500 సంపన్నుల్లో(Among the world’s 500 richest) అత్యధిక సొమ్మును అర్నల్ట్ కోల్పోయారు. 25.1 బిలియన్ డాలర్లు నష్టపోయి 80.2బిలియన్ డాలర్లకు ఆస్తి పడిపోయింది. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) ప్రకారం, 80.6 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ నాలుగోస్థానానికి చేరారు.
భారత కుబేరుడు ముఖేష్ (Indian tycoon Mukesh) ఇటీవలే సిలికన్ వ్యాలీ టైకూన్(Silicon Valley Tycoon)లను అధిగమించారు. ఎలన్ మస్క్, ఆల్ఫబెట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్, ల్యారీ పేజ్, వారెన్ బఫెట్‌లతోపాటు పలువురు దిగ్గజాలను ముఖేష్ సంపదలో ఓవర్‌టేక్(Overtake) చేశారు. ముఖేష్ చమురు సామ్రాజ్యం(Oil empire) నష్టాల్లో చిక్కుకున్న డిజిటల్ యూనిట్(Digital unit) కలిసొచ్చింది. ఫేస్‌బుక్, గూగుల్ సంస్థల పెట్టుబడుల(With investments from Facebook and Google companies)తో డిజిటల్ యూనిట్ మరింత బలోపేతం అయింది. క్రమంగా అంబానీ, ఈకామర్స్(e-commerce) వైపు దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే.