- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదు కథలతో ‘అన్‌పాజ్డ్’
దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీల్లో ఇప్పుడు కొత్తగా ‘ఆంథాలజీ’ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఐదుగురు టాలెంటెడ్ డైరెక్టర్స్, ఐదు కథల సమాహారంగా అమెజాన్ ఇటీవలే అందించిన చిత్రం ‘పుత్తం పుదు కాలై’. ఇది సక్సెస్ సాధించడంతో హిందీలో ‘అన్‌పాజ్డ్’ పేరుతో మరో ఆంథాలజీ ప్లాన్ చేసింది అమెజాన్. ఇటీవలే అందుకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా, అది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 8న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది.
ఐదుగురు దర్శకులు.. ఐదు భిన్నమైన కథలు.. వెరసి ‘అన్‌పాజ్డ్’ ఆంథాలజీ మన ముందుకు రాబోతుంది. ప్రేమ, సంతోషం, డ్రీమ్స్, ఫ్రెండ్‌షిప్, హోప్ ఇలా ఒక్కో షార్ట్ ఫిల్మ్ మనకు ఒక్కో ఫ్లేవర్ అందించబోతుంది. ది ఫ్యామిలీ మ్యాన్‌తో ఆకట్టుకున్న దర్శకులు రాజ్ అండ్ డీకే కలిసి తీసిన చిత్రం ‘గ్లిచ్’. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ఇందులో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వస్తున్న మరో షార్ట్ ఫిల్మ్ ‘అపార్ట్‌మెంట్’. ఇందులో రిచా చద్దా, సుమిత్ వ్యాస్, ఇష్వక్ సింగ్‌లు లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్, డైరెక్టర్ తనిష్ట ఛటర్జీ ‘ర్యాట్ ఏ టాట్’ను తెరకెక్కిస్తోంది. సైరాత్ ఫేమ్ రింకు రాజ్ గురు హీరోయిన్‌గా చేస్తుండగా, లిల్లెటి దూబే ఆమెకు జోడిగా నటిస్తున్నాడు. ఇక అవినాష్ అరున్ డైరెక్ట్ చేస్తున్న ‘విషాను’లో అభిషేక్ బెనర్జీ, గీతిక విద్యలు నటిస్తున్నారు. చివరగా ఫిల్మ్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ నిత్య మెహ్రా ‘చాంద్ ముబారక్’ తెరకెక్కిస్తుండగా.. ‘మేడ్ ఇన్ హెవెన్’ ఫేమ్ రత్నా పాఠక్, పాటక్ షాతో పాటు శార్దుల్ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ అందిస్తున్న ఈ ఆంథాలజీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.