‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ వాయిదా?

by Jakkula Samataha |   ( Updated:2021-01-31 04:43:53.0  )
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ వాయిదా?
X

దిశ, సినిమా: మనోజ్ భాజ్‌పాయ్ ప్రధానపాత్రలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సూపర్ హిట్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్‌గా వచ్చిన సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా.. నెక్స్ట్ సీజన్ కూడా రెడీ అయిపోయింది. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విలన్‌గా కనిపించనున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న సిరీస్ హిందీ, తెలుగు, తమిళ్‌లో వచ్చే నెల 12న రిలీజ్ కానుందని ఆల్రెడీ అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి సిరీస్‌ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకుందట.

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ‘మీర్జాపూర్’ ‘తాండవ్’ సిరీస్‌లు.. రెండూ కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసిందని సమాచారం. కుల, మత మనోభావాలను కించపరిచాయంటూ ‘మీర్జాపూర్’ ‘తాండవ్‌’పై కోర్టులో కేసు నడుస్తుండగా ఈ నిర్ణయం తీసుకుందట అమెజాన్ ప్రైమ్. మరి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లోనూ ఇలాంటి రీజినల్ సెంటిమెంట్స్‌తో ప్రాబ్లమ్ అవుతుందని ఆలోచిందో లేక కోర్టు కేసుల్లో చిక్కుకున్న తాము ఎందుకు ఎంటర్‌టైన్ చేయాలనుకుందో తెలియదు కాని.. వచ్చే నెల 12న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ రిలీజ్ వాయిదా వేసిందని సమాచారం. దీనిపై నెక్స్ట్ వీక్‌లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనుందట ప్రైమ్.

Advertisement

Next Story