- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నచ్చిన మూవీ క్యారెక్టర్స్‌తో.. అమెజాన్ ప్రొఫైల్ ఫొటో!
దిశ, ఫీచర్స్ : అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త ఫీచర్‌ని విడుదల చేయగా, ఇది అమెజాన్ ఒరిజినల్ మూవీస్, షోలలో ప్రముఖ పాత్రల ప్రొఫైల్ ఇమేజ్‌లను సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అమెజాన్ ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురాగా ఆసక్తి ఉన్నవాళ్లు దీనిని ప్రయత్నించవచ్చు. ప్రైమ్ వీడియోకు సపోర్ట్ చేసే అన్ని డివైజ్‌ల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ విడుదల చేసిన న్యూ ఫీచర్ ఆధారంగా గుడ్ ఒమెన్స్, ది టుమారో వార్, ది బాయ్స్, బోరాట్, బాష్, కమింగ్ 2 అమెరికా, ఫ్లీబాగ్, ది మిస్టర్ మైసెల్, ఇన్విన్సిబుల్, సిల్వీస్ లవ్, టామ్ క్లాన్సి జాక్ ర్యాన్, వన్ నైట్ ఇన్ మయామి, మేకింగ్ ది కట్, హంటర్స్, వితౌట్ రిమోర్స్, ది వైల్డ్స్, అప్‌లోడ్, ట్రూప్ జీరో, హన్నా, ది ఎక్స్‌పాన్స్, కార్నివాల్ రో వంటి మూవీ షోలకు సంబంధించిన క్యారెక్టర్ ఫొటోలను డీపీలుగా పెట్టుకోవచ్చు.
IOS, Android , Fire టాబ్లెట్‌లలో ప్రొఫైల్ ఫోటోను ఎలా మార్చాలి :
* మీ ఫోన్‌లో యాప్‌ను తెరిచి, ప్రైమ్ వీడియో యాప్ స్క్రీన్ దిగువన ఉన్న ‘మై స్టఫ్‌పై’ క్లిక్ చేయండి
* డ్రాప్-డౌన్ మెనుని తెరవడానికి ప్రొఫైల్ నేమ్‌పై క్లిక్ చేయండి. ఆపై ఎడిట్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు మార్చాలనుకుంటున్న ఇమేజ్ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి
* ఎడిట్ ప్రొఫైల్ స్క్రీన్‌పై, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ని ట్యాప్ చేయండి. అందుబాటులో ఉన్న జాబితా నుంచి ఎంపిక చేసుకోండి.
* అదే కొత్త ప్రొఫైల్ అయితే, ప్రొఫైల్ ఇమేజ్‌పై క్లిక్ చేసి అందుబాటులో ఉన్న జాబితా నుంచి ఎంపిక చేసుకోండి.
గమనిక: ఫీచర్ మీకు కనిపించకపోతే, కొన్ని రోజులు వేచి ఉండాలి. అలాగే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ తాజా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.