- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కేంద్రంగా ‘అమెజాన్’ మరో కీలక నిర్ణయం..
దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ దేశవ్యాప్తంగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌కు అదనంగా లక్ష చదరపు అడుగులతో మొత్తం 4 లక్షల చదరపు అడుగుల స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోనుంది. కొత్తగా అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో కలిపి ప్రస్తుతం అమెజాన్ రాష్ట్రంలో 5 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను కలిగి ఉంటుంది.
అదేవిధంగా రాష్ట్రంలో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కలిగిన సంస్థగా మారనుంది. దీంతో పాటు అమెజాన్ మొత్తం నిల్వ సామర్థ్యం 5 లక్షల క్యూబిక్ అడుగులకు చేరుకుంటుంది. ‘తాజా విస్తరణ ప్రక్రియ ద్వారా అమెజాన్ సంస్థ వినియోగదారులకు భారీ పరికరాలు, ఫర్నిచర్ విభాగంలో కొత్త అనుభూతిని అందించనుంది. రాష్త్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు సాధికారత లభిస్తుంది. కొత్త నిర్ణయం ద్వారా అమెజాన్ స్టొరేజ్ సామర్థ్యం 25 శాతానికి పెరుగుతుందని’ అమెజాన్ ట్రాన్స్‌పోర్ట్ సేవల డైరెక్టర్ అభినవ్ సింగ్ అన్నారు.