Amazonలో అదిరిపోయే పండగ ఆఫర్లు .. ఎప్పటినుంచంటే ?

by Harish |   ( Updated:2021-09-24 08:56:19.0  )
amazon
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కోసం ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ విక్రయాలకు తేదీలను శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే, ఎంతకాలం ఈ సేల్ నిర్వహించనున్నది స్పష్టత ఇవ్వలేదు. ఇక, ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ పండుగ ఆఫర్ సేల్ ఒకరోజు ముందుగా మొదలవుతుందని తెలిపింది. అలాగే, ప్రైమ్ మెంబర్లు అదనపు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలు పొందనున్నారు. ఈ పండుగ ఆఫర్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు యాపిల్, ఆసుస్, లెనోవో, హెచ్‌పీ, శాంసంగ్, వన్‌ప్లస్, సోనీ లాంటి కంపెనీల నుంచి భారీ సంఖ్యలో కొత్త ఉత్పత్తులను విక్రయించనున్నట్టు అమెజాన్ వివరించింది.

అలాగే, అమెజాన్ ఎకో, కిండ్‌లే, ఫైర్‌స్టిక్ లాంటి పరికరాలను తక్కువ ధరలో పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. ఉత్పత్తులతో పాటు ఈసారి పండుగ సీజన్ కోసం అమెజాన్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి ప్రత్యేక ఆఫర్లను ఇవ్వనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తకష క్యాష్‌బ్యాక్ అందించనుంది. దేశీయ మరో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సైతం పండుగ సీజన్ కోసం అక్టోబర్ 7 నుంచి ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed