- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amazon ప్రత్యేక ఆఫర్ విక్రయాల కోసం HDFC తో భాగస్వామ్యం
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ కంపెనీ బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఆఫర్ల వివరాలను ప్రకటించింది. తాజాగా అమెజాన్ సంస్థ ప్రతి ఏటా నిర్వహించే ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ప్రత్యేక విక్రయ ఆఫర్ల వివరాలను వెల్లడించింది. పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో ఈ విక్రయాలు మొదలవుతాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అమెజాన్ స్పష్టమైన తేదీలను ఇంకా ప్రకటించలేదు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ఇవ్వనున్నట్టు, అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు వివరించింది. అంతేకాకుండా అమెజాన్ పే ద్వారా చెల్లింపులను జరిపితే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. అలాగే, ఈ ప్రత్యేక సేల్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులపై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. త్వరలో ఇతర ఆఫర్ల వివరాలను తెలపనున్నట్టు అమెజాన్ వెల్లడించింది.