- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-కామర్స్ సంస్థలకు ఏప్రిల్ 20 తర్వాత అనుమతులు!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20 తర్వాత కొన్ని సంస్థలకు లాక్‌డౌన్ సడలింపు ఉండనున్న నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, కొన్ని సంస్థలు టీవీలను, రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంకా ఇతర ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. బుధవారమే ఈ విషయంపై ప్రకటన వచ్చినప్పటికీ యే యే వస్తువులకు అనుమతులుంటాయనే దానిపై స్పష్టం రాలేదు. గురువారం పూర్తీ వివరాలు రావడంతో సంస్థలు పూర్తీ స్థాయిలో భద్రత కలిగిన డెలివరీలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాల్లో కేవలం ఆహారం, వైద్య సంబంధ వస్తువులు, పరికరాలకే అనుమతులుంటాయని ఇచ్చింది. తాజాగా దాన్ని సవరిస్తూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు ఏప్రిల్ 21 నుంచి పూర్తీ స్థాయిలో పనిచేసేందుకు అనుమతులివ్వనున్నారు.
ఈ-కామర్స్ సంస్థలు పనిచేసేందుకు గానూ ఆపరేటర్లు ఉపయోగించే వాహనాలు డెలివరీ ప్రాంతాల్లో తిరిగేందుకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర హోమ్ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల వల్ల వస్తువుల పంపిణీపై మాత్రమే ఆధారపడిన ఈ-కామర్స్ సంస్థలకు ఈ సడలింపుల ద్వారా ఉపశమనం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదివరకే ఫ్లిప్‌కార్ట్, జొమాటో, మెడ్‌లైఫ్, మిల్క్‌బాస్కెట్ సహా కొన్ని సంస్థలు డెలివరీ సిబ్బంది పోలీసుల ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వాలతో చర్చించాయి. ఈ విషయంపై బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశాయి. డెలివరీ చేసే సిబ్బంది ధృవీకరణ పత్రాలను దగ్గర ఉంచుకుని రవాణా చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
Tags: Amazon, E-Commerce, Flipkart