భారీగా నియమాకాలకు ప్లాన్ చేసిన అమెజాన్..

by  |
amezan
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారీగా టెక్ నిపుణుల నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. సంస్థ కొత్త సీఈఓ యాండీ జస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయంగా రానున్న నెలల్లో కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో 55,000 మందిని నియమించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రిటైల్, క్లౌడ్ విభాగాల్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నామని, అదేవిధంగా ప్రాజెక్ట్ కైపర్ బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవల విస్తరణ కోసం ఉద్యోగులు అవసరమవుతాయని యాండీ జస్సీ వివరించారు. అమెజాన్ జాబ్ ఫెయిర్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుండగా, ఇది కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు అనువైన సమయంగా జస్సీ భావిస్తున్నారు.

కొవిడ్ వల్ల చాలామంది ఉద్యోగాలను కోల్పోయారు. కొత్త పని వెతికే వారు చాలామందే ఉన్నారు. వారికోసం అమెజాన్ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని జస్సీ అభిప్రాయపడ్డారు. మరోవైపు, భారత్‌లో అమెజాన్ రిటైల్ భారత్‌లో రైతుల కోసం అగ్రోనమీ సేవలను మంగళవారం ప్రారంభించింది. టెక్నాలజీ సంబంధిత సేవలను వినియోగిస్తూ వ్యవసాయంలో సలహాలు, నిర్ణయాలు, సూచనల కోసం దీన్ని ప్రారంభించినట్టు అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. రైతులకు కొత్త సాంకేతికత అందించడమే కాకుండా అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ఈ అగ్రోనమీ ఉపయోగపడుతుందని అమెజాన్ ఇండియా గ్రాసరీ, ఫుడ్, హెల్త్ విభాగం డైరెక్టర్ సమీర్ వివరించారు.

Next Story

Most Viewed