రాజధాని రైతుల ఆందోళన

by srinivas |
రాజధాని రైతుల ఆందోళన
X

దిశ వెబ్ డెస్క్: అసైన్డ్ రైతులకు కౌలు సొమ్ముల విషయంలో వైసీపీ సర్కార్ తీరుపై ఏపీ రైతులు నిరసన వ్యక్తం చేశారు. కౌలు సొమ్ములు వేయకుండా ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు అన్నారు. ఉద్దండ రాయుని పాలెం శిబిరంలో అంబెద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహిళలు, రైతులు ఆందోళన చేపట్టారు. కాగా శిబిరానికి అనుమతులు విషయంలో పోలీసుల జాప్యంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్ల పై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతుల చేస్తున్న నిరసన దీక్షలు 260వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తూళ్లూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉద్దండ రాయుని పాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed