హైకోర్టు చిత్రపటానికి హారతులు

by srinivas |
హైకోర్టు చిత్రపటానికి హారతులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో రాజధాని ప్రాంతాల్లో నిరసనలు మళ్లీ హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తుళ్లూరు మహిళా రైతులు హైకోర్టును దేవాలయంగా భావించి హారతులిచ్చి పూజలు చేశారు. కోర్టు చిత్రపటానికి పూలు జల్లి.. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. రాజధాని అమరావతిని తరలించడానికి ప్రభుత్వం చకచకా పావులు కలుపుతోందని.. ఇక అమరావతిని రక్షించాల్సింది కోర్టులేనని అన్నారు. ఇందు కోసం కోర్టును దేవాలయంగా భావించి పూజలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed