- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు పార్టీలు ఎదురెదురు…అమరావతిలో ఉద్రిక్తత
దిశ వెబ్‌డెస్క్: అమరావతిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల తీరుతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు గత 73 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పరిసరాల్లో వైఎస్సార్సీపీ నేతలు ఎవరైనా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు వారిని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ నందిగం సురేష్ వాహనాన్ని రెండు సార్లు అడ్డుకున్నారు.
రాజధాని ప్రాంతంలో 54,307 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా రైతుల దీక్షా ప్రాంగణాల మీదుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో రైతుల దీక్షా ప్రాంగణాల వద్దకు చేరుకోగానే జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వారికి పోటీగా జై అమరావతి అంటూ దీక్షా శిబిరంలోని వారు నినాదాలు చేశారు. పోటీ పోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.