- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమర రాజా బ్యాటరీస్ నికర లాభం రూ. 201 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ నికర లాభం 7.93 శాతం క్షీణించి రూ. 201.27 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 218.61 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 14.16 శాతం పెరిగి రూ. 1,935.52 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 1,695.31 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
‘ఈ త్రైమాసికంలో అన్ని రంగాల్లో డిమాండ్ పుంజుకోవడంతో సంస్థ పనితీరు మెరుగ్గా కొనసాగింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు బలమైన కార్యాచరణ మార్గదర్శకాలను అమలు చేయడంతో ఉత్పాదక సామర్థ్య వినియోగం, పంపిణీ కార్యకలాపాలను పెంచేందుకు వీలైందని’ అమర రాజా సీఈవో ఎస్ విజయానంద్ తెలిపారు. రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు 13.11 శాతం పెరిగి రూ. 1,676.03 కోట్లకు చేరుకున్నాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం సెన్సెక్స్‌లో 4.03 శాతం పెరిగి రూ. 789.10 వద్ద ముగిశాయి.