స్వేచ్ఛగా బతకలేకపోతే అర్థం లేదు : అమల

by Shyam |   ( Updated:2021-10-31 22:39:31.0  )
స్వేచ్ఛగా బతకలేకపోతే అర్థం లేదు : అమల
X

దిశ, సినిమా : ప్రజెంట్ జనరేషన్ యాక్టర్స్ ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. సమయం దొరికినప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. కాగా డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హీరోయిన్ అమలాపాల్.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని హాట్ పిక్స్‌ షేర్ చేసింది. పసుపు పచ్చని జాకెట్, తలకు రిబ్బన్ ధరించిన పిక్స్ షేర్ చేస్తూ.. ‘నాగరిక జీవితం అనే గందరగోళం‌లో ఎవరు చిక్కుకోవద్దు. మనం స్వేచ్ఛగా బ్రతకడం కోసం పుట్టాం. స్వేచ్ఛగానే పరుగులు పెట్టాలి’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ‘నీ లుక్స్‌కు ఫిదా అయ్యాం అమల’.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

లిప్‌ లాక్‌లే కాదు.. బెడ్రూంలోకి కూడా ఓకే చెప్పిన నటి

https://twitter.com/Amala_ams/status/1454433852638695425?s=20

Advertisement

Next Story