- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని దానాలకన్నా, రక్తదానం మిన్న: సీఐ గంగాధర్
దిశ, అల్వాల్; అన్ని దానాలకన్నా రక్తదానం ఎంతో గొప్ప దానమని అల్వాల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గంగాధర్ అన్నారు. శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అల్వాల్ సివిఆర్ గార్డెన్లో మెగా రక్తదాన సిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తం దానం చేయడం అంటే మరోకరికి ప్రాణం పోయడం అని అన్నారు. కర్తహీనత కలిగినవారికి, తలసేమియా బాధితులకు అండగా నిలువాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ ఆదేశానుసారం చేపట్టిన ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వారి సహాకారం తోడు కావడంతో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువకులతో మెగా క్యాంపు సంపూర్ణంగా విజయవంతం చేశామని తెలిపారు.
ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు రావని మనబాడీ రీఫ్రెస్ అవుతుందన్నారు. ఒక మనిషి అనేక సార్లు రక్తం దానం చేయవచ్చని డాక్టర్లు తెలుపుతున్నారని తెలిపారు. శిబిరం విజయవంతానికి సహాకారంచినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయలక్ష్మీ, ఎస్సైలు పరుశురాం, భాస్కర్, మాజీద్ ఆలీ, బేతప్ప, రాజశేఖర్, జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.