- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల.. నెట్‌ఫ్లిక్స్‌లో అల్లు ఫిక్స్!
దిశ, వెబ్‌డెస్క్:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దుమ్ముదులిపేస్తోంది. కేవలం విదేశీ సినిమాలు, టీవీ షోలు మాత్రమే కాదు.. తెలుగు సినిమాలు రికార్డు స్థాయిలో వీక్షణలు సంపాదించగలవని ఈ చిత్రం నిరూపించింది. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ అక్కడ కూడా తన ఆధిపత్యాన్ని చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఈ సినిమా సన్‌నెక్స్ట్‌లో అందుబాటులో ఉంది. రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకేసారి విడుదలైన సినిమాగా కూడా ఇది నిలిచింది.
అయితే అల్లు అరవింద్ కొత్తగా ప్రారంభించి ఆహా ప్లాట్‌ఫాంలో ఈ సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ జరగలేదు. ఇక సినిమా కలెక్షనల్లో 50 రోజులు పూర్తి చేసుకుని అత్యధిక కలెక్షన్లు సాధించి నాన్ బాహుబలి 2 రికార్డులన్నంటినీ బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్ సీస్ లోనూ బాహుబలి చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అరుదైన రికార్డు నెలకొల్పింది. తద్వారా ఇటు అల్లు అర్జున్ కెరీర్ లోనూ, అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది.