నవీన్ పొలిశెట్టితో మర్ఫా డాన్స్ వేయించిన బన్ని!

by Jakkula Samataha |   ( Updated:2021-03-12 01:26:18.0  )
నవీన్ పొలిశెట్టితో మర్ఫా డాన్స్ వేయించిన బన్ని!
X

దిశ, సినిమా : మహాశివరాత్రి కానుకగా రిలీజైన ‘జాతిరత్నాలు’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌ను నవ్వులతో నింపేస్తున్న ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుండగా.. తాజాగా జాతిరత్నాలు సినిమా చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘రీసెంట్‌గా ఒక మూవీ చూసి ఇంతగా నవ్వింది ఇప్పుడే, నవీన్ స్టెల్లర్ పర్ఫార్మెన్స్‌తో షో స్టీల్ చేశాడు’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ మేరకు నవీన్ న్యూ ఏజ్ స్టన్నింగ్ పర్ఫార్మర్‌ అంటూ కితాబిచ్చిన బన్ని.. రాహుల్ రామకృష్ణ బ్రిలియంట్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యానని తెలిపారు. ప్రియదర్శి, హీరోయిన్ ఫరియాతో పాటు కాస్ట్ అండ్ క్రూ ఎఫర్ట్ సినిమాలో కనిపిస్తోందని, నిర్మాతలు నాగ్ అశ్విన్, స్వప్న అండ్ ప్రియాంక దత్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఇక డైరెక్టర్ అనుదీప్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేసిన బన్ని.. జాతిరత్నాలు ద్వారా ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పాడు. మైండ్ స్విచ్ ఆఫ్ చేసి సినిమాను ఆస్వాదించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులను కోరాడు.

కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన నవీన్ పొలిశెట్టి.. ‘థాంక్స్ రాక్ స్టార్! మిమ్మల్ని నవ్వించినందుకు సంతోషంగా ఉంది. మీ ట్వీట్ చూశాక ఆనందంతో మర్ఫా డాన్స్ వేస్తూ రిప్లై ఇస్తున్నా’ అని తెలిపాడు.

Advertisement

Next Story