- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడి – సీపీఐ (ఎం)
దిశ ప్రతినిధి , హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పేదలకు కేటాయించాలని సీపీఐ (ఎం) చేస్తున్న డిమాండ్‌కు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు. నగరంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరానికి లక్ష ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పి సుమారు ఏడున్నర సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కేవలం 14 వేల మందికి మాత్రమే ఇచ్చాడన్నారు .
ఇండ్లను ఆశగా చూపి ఎన్నికలలో అధికార పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు . ప్రభుత్వ భూముల వేలాన్ని నిలిపివేసి పేదలకు ఆ స్థలంలో డబుల్ బెడ్రూం నివాసాలు నిర్మించి ఇవ్వాలన్నారు . సీపీఐ (ఎం) నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రేటర్ పరిధిలో అర్హులైన పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో పేద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కల్గించాలని కోరారు .