- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ కూతురినీ ఇలాగే దహనం చేసేవారా ?
లక్నో: హాథ్రస్ ఘటనలో పోలీసుల తీరుపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది. కుటుంబీకుల అనుమతి లేకుండా బాధితురాలిని దహనం చేయడంపై ఆగ్రహించింది. యూపీ ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్‌పై ధర్మాసనం ప్రశ్నలు కురిపించింది. ఏడీజీ తన కూతురినీ ఇలాగే దహనం చేయడానికి అనుమతించేవారా? ఒకవేళ బాధితురాలు సంపన్న కుటుంబానికి చెందినవారైతే పోలీసులు ఇలాగే నడుచుకునేవారా? అని న్యాయమూర్తులు పంకజ్ మిట్టల్, రంజన్ రాయ్‌ల ధర్మాసనం ప్రశ్నించినట్టు బాధిత కుటుంబ కౌన్సెల్, న్యాయవాది సీమా కుశ్వాహా తెలిపారు. బాధిత కుటుంబానికి భద్రత లేనందున, ఇప్పటికే కొందరు నిందితులకు మద్దతుగా నిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నందున కేసును యూపీ బయటకు ట్రాన్స్‌ఫర్ చేయాలని ధర్మాసనాన్ని బాధితులు అర్థించారు. అలాగే, న్యాయవిచారణ పూర్తయ్యేవరకు భద్రత కల్పించాలని అభ్యర్థించారు.
కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచాలని అర్థిస్తూ కేసు దర్యాప్తు వివరాలను బయటపెట్టకుండా ఆదేశించాలని కుశ్వాసా ధర్మాసనాన్ని కోరారు. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా బాధిరాలికి అంత్య క్రియలు నిర్వహించారని బాధిత కుటుంబం కోర్టుకు తెలిపింది. అంతిమ సంస్కారాలకు తమను అనుమతించలేదని వివరించింది. బాధితురాలి మృతదేహానికి అదే రోజు అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న నిర్ణయం తనదేనని జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్స్‌కర్ కోర్టుకు తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెట్టే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కేసును వచ్చే నెల 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కాగా, ఈనెల 15న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనున్న సంగతి తెలిసిందే.