ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి : టీపీటీఎఫ్

by vinod kumar |
TPTF
X

దిశ, వెబ్‌డెస్క్: వయస్సుతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, కోవిడ్ చికిత్సకు రియింబర్స్‌మెంట్ పరిమితిని రూ1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఇంకా పాఠశాలలు నిర్వహిస్తున్న సందర్భంలో అనేకమంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. కావున వయసుతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. అంతేగాకుండా.. కోవిడ్ చికిత్సకు విడుదల చేసిన ఉత్తర్వులను రూ.5 లక్షలకు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయులు అనేక లక్షలు వెచ్చింది ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు.

tptf

Advertisement

Next Story