- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని దేశాలు, రాష్ట్రాలు అప్పులు చేస్తుంటాయి- మంత్రి బుగ్గన
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని విపక్షాలపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ గగ్గోలుపెట్టడం సరికాదన్నారు. అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తుంటాయని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, అప్పులపై విపక్ష నేతల ఆరోపణలు దారుణమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసిందని గుర్తు చేశారు.
కరోనా కట్టడి కోసం రూ.7,130.19 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలను ఆదుకున్నామని చెప్పుకొచ్చారు. అలాగే విద్యావ్యవస్థకు రూ.25,914.13 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధులకు రూ.37,461.89 కోట్లను పింఛన్ల రూపంలో అందించామన్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాల కింద రూ.17,608.43 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మహిళలు, సామాన్యులకు భరోసా కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు.
పలు ప్రభుత్వ పథకాల ద్వారా నగదు నేరుగా ప్రజల అకౌంట్లోకే జమ చేశామని.. ఫలితంగా వస్తువులు, సేవల డిమాండ్ దెబ్బతినకుండా కాపాడగలిగినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం.. ప్రజల శ్రేయస్సుకోసం ఇంతలా నిధులు వెచ్చిస్తుంటే అభినందించాల్సిపోయిన ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేందుకే టీడీపీ విషప్రచారం చేస్తోందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.