- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి : బక్కని
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడింది కేవలం టీడీపీయే అన్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యంతో పాటు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశందే అన్నారు. సంస్థాగతంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, త్వరలోనే గ్రామ, మండల, పార్లమెంట్ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమాంతరంగా ప్రజాసమస్యలపై వెళ్దామని పిలుపు నిచ్చారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజాసమస్యలే ప్రధాన జెండాగా పార్టీ నాయకులు ముందుకు సాగాలన్నారు. సభ్యత్వాల టార్గెట్‌ను త్వరగా పూర్తి చేసి, కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నోజు శ్రీనివాసాచారి, అధికార ప్రతినిధి జాటోతు ఇందిర, ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్, కార్యనిర్వహక కార్యదర్శులు హన్మకొండ సాంబయ్య, అర్షనపల్లి విద్యాసాగర్ రావు, బాబా ఖాదర్ అలీ ఎధర్, వెంకటరాజం, ప్రభాకర్, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ కుమార్, పోతరాజు అనిల్, జనార్దన్ రావు, నల్లకుంట రవి, కుందుకూరి నరేష్, ఎలుగు వెంకటేశ్వర్లు, బత్తిని రమేష్ తదితరులు పాల్గొన్నారు.