- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే రేగా ఇలాకాలో అఖిలపక్ష నాయకులు నిరసన
దిశ, మణుగూరు : తెలంగాణ ప్రభుత్వం పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో వందపడకల ఆసుపత్రిని పేరుకే నిర్మించిందని, అందులో వైద్యులను నేటివరకు నియమించలేదని అఖిలపక్ష నాయలుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను, సిబ్బంది వెంటనే నియమించాలని బుధవారం నియోజకవర్గంలోని పలు మండలాలలో అఖిలపక్ష నాయకులు ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి, మండలాల తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. మణుగూరు మండలంలో పేరుకే వందపడకల ఆసుపత్రి ఉందని, అందులో వైద్యులను నేటికి నియమించలేదని ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే రేగా మండిపడ్డారు.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నాయకులు మండిపడ్డారు. నాలుగు మండలాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడకుండా, ప్రజల ప్రాణాలను గాలిలో కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది పేదప్రజలు అనారోగ్యాలతో ఇంట్లో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరురెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతికాదన్నారు. ఏజెన్సీలో ఉన్న నీరుపేద ప్రజల ఆరోగ్యం క్షిణిస్తే, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజల ప్రాణాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం మొండివైఖరి చూపుతోందన్నారు. వైద్యులను నియమిస్తారా.. లేదా అని ప్రశ్నించారు. వైద్యులను నియమించకుంటే ఈనెల 4న అఖిలపక్షపార్టీల ఆధ్వర్యంలో వందపడకల ఆసుపత్రి ముందు ధర్నాలు, రోడ్లు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలను పట్టించుకోలేని స్థానిక ఎమ్మెల్యే ఎందుకని, స్థానిక ఎమ్మెల్యేపై ప్రజలు తిరగపడే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ప్రజల ప్రాణాలపై దృష్టి సారించి, వందపడకల ఆసుపత్రిలో తక్షణమే వైద్యులను, సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి.అయోధ్య, కాంగ్రెస్ నాయకులు పిరినకి నవీన్, బీజేపీ నాయకులు చిర్ర సరస్వతీ, టీడీపీ నాయకులు వట్టం నారాయణదొర, సీపీఐ ఎంఎల్ నాయకులు ఆర్.మధుసూధన్ రెడ్డి, సీపీఎం నాయకులు గద్ధల శ్రీనివాస్, టీజేఏసీ నాయకులు పగడాల కరుణాకర్ రెడ్డిలతో పాటు దూర్గ్యల సుధాకర్, బాడిశ సతీష్, గోల్లా సాంబశివరావు, ముక్కెర లక్ష్మణ్, అక్కి నర్శింహరావు, లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.