- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వాస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు
X
దిశ, ఖానాపూర్:
ప్రభుత్వాస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో గురువారం ఆస్పత్రి సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దవాఖానకు వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించాలని, డెలివరీ కేసుల సంఖ్య పెంచాలని డాక్టర్ వంశీకి సూచించారు. వాడకంలో లేని పాత అంబులెన్స్ తొలగించి కొత్త అంబులెన్స్ కొనుగోలు చేయాలన్నారు.
రోగులకు మంచి నీళ్ళు అందించడానికి నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ప్రభుత్వ దవాఖానలో డిజిటల్ ఎక్స్రే మిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఎంపీపీ మోహిన్, కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story