క్యాప్‌లో ప్రియున్ని చూసుకుంటున్న అలియా

by Shyam |
Alia
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ యాక్టర్స్ రణ‌బీర్ కపూర్, అలియా లవ్ స్టోరీ గురించి తెలిసిందే. బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్.. సందర్భం ఏదైనా జంటగా దర్శనమిచ్చే ఈ లవ్ బర్డ్స్ తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కు సంబంధించిన పిక్స్ కూడా వీళ్ల క్లోజ్‌నెస్‌‌ను ప్రూవ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం కొన్ని సెల్ఫీ పిక్చర్స్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేసిన అలియా.. రణబీర్‌ను ఎంతలా మిస్ అవుతుందో చెప్పకనే చెప్పింది.

ఈ పిక్‌లో రణబీర్ వద్ద నుంచి దొంగిలించిన క్యాప్‌ను ధరించగా, దానిపై ‘మీ అంచనాలకు మించి’ అనే క్యాప్షన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ ఫొటో పోస్టుతో పాటు ‘మీ ప్రియున్ని మిస్ అయితే, అతని వస్తువులు దొంగిలించండి’ అంటూ ఫ్యాన్స్‌కు మెసేజ్ ఇచ్చిన అలియా.. మీ పార్ట్‌నర్‌ను మిస్ అయ్యే పరిస్థితులుంటే వారి వస్తువులతో వీలైనన్ని ఎక్కువ సెల్ఫీలు తీసుకోండని సూచించింది. ఈ పోస్టుపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం అలియా నటించిన ‘ఆర్ఆర్‌ఆర్’తో పాటు ‘గంగూబాయి కతియావాడి, బ్రహ్మస్త్ర’ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed