- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హార్డ్ టైమ్స్ చూశా : ఆలియా
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని నెలలుగా బాలీవుడ్‌లో నెగెటివిటీ ఎక్కువైపోయింది. పలు కారణాలతో చాలా మంది యాక్టర్స్ ఇబ్బందులు పడ్డారు. కొందరు నెపోటిజం కారణంగా నెటిజన్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే, మరికొందరు ఎన్‌సీబీ డ్రగ్ ఇన్వెస్టిగేషన్ కేసుతో విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా నెపోటిజం వల్ల సోషల్ మీడియాతో పాటు సినిమా డిజాస్టర్ ద్వారాను కఠిన పరిస్థితులను చూసిన బాలీవుడ్ కిడ్స్ లిస్ట్‌లో ఆలియా భట్ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు హాజరవుతూ ఆ బాధ నుంచి బయటపడేందుకు ట్రై చేస్తున్న టాలెంటెడ్ హీరోయిన్.. తాజాగా ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి మాట్లాడింది.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆలియా.. గడిచిన కొన్ని నెలలు చాలా హార్డ్‌గా ఉన్నాయని తెలిపింది. ఈ సమయంలో చాలా హేట్ ఎదుర్కొన్నానని, కొంచెం దయ మనల్ని ఎక్కడికో తీసుకెళ్లగలదని అభిప్రాయపడింది. ఈ హార్డ్ టైమ్స్‌లో తను చాలా రియలైజ్ అయ్యానని.. ఒకరి పట్ల ఒకరు దయగా ఉండటంతో పాటు మనం నివసించే గ్రహం పట్ల కూడా దయగా, బాధ్యతగా ఉండాలని నేర్చుకున్నానని తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఎంత ముఖ్యమో కూడా వివరించింది ఆలియా.
కాగా ఆలియా తాజాగా ‘ఎడ -ఎ- మమ్మ’ అనే కిడ్స్ వేర్ క్లాథింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసింది. ప్లాస్టిక్ లేకుండా పూర్తి సహజంగా తయారైన వస్త్రాలే ఈ క్లాథింగ్ బ్రాండ్ ప్రత్యేకత కాగా.. నెక్స్ట్ ఇయర్ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. 2-14 ఏళ్ల వయస్సుగల చిన్నారులకు ఈ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి.