- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పిల్లలకు టీచర్.. ‘అలెక్సా’నే
దిశ, వెబ్‌డెస్క్: ‘యాపిల్ సిరి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ ‘అలెక్సా’ ఇవన్నీ కూడా.. వాయిస్ అసిస్టెంట్ యాప్‌లే. వీటిలో ‘హాయ్ అలెక్సా.. ప్లే మీ సాంగ్’. లేదా ‘హాయ్ అలెక్సా.. టెల్ మి ద రూట్’, ‘హాయ్ అలెక్సా.. కాల్ హోమ్’, ‘హాయ్ అలెక్సా.. ప్లే మి క్రికెట్’.. దాదాపు అందరూ ఇవే ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే ఎవరికి తెలుసు.. ఈ ‘అలెక్సా’నే స్నేహితుడిగానో లేదా టీచర్‌గానో మారుతుందని. అవును.. ఛత్తీస్‌గడ్, బస్తర్‌లో అదే జరిగింది. కొందరు పిల్లలకు ‘అలెక్సా’ టీచర్‌గా మారింది. అమెజాన్ ఇండియన్ న్యూస్‌లో వచ్చిన ఈ వీడియో వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. అందరికీ కనువిప్పు కలిగిస్తోంది.
ఆదివాసీ, ట్రైబల్ పిల్లలుగా ఎక్కువగా ఉండే బస్తర్‌లో విద్యార్థులకు చదుకోవాలని ఉన్నా.. చదువు చెప్పేందుకు సరిపడా టీచర్లు లేరు. ఆ సమస్యను తీర్చేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ విషయంపై ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘టీచర్ల కొరతను తీర్చడానికే ఇలా ‘స్మార్ట్ క్లాస్’ ఐడియా చేశాను. మొదట ప్రయోగాత్మకంగా ఓ స్కూళ్లో చేశాను. అక్కడి పిల్లలకు ఇది ఎంతగానో నచ్చడంతో పాటు వారిలో కొత్త ఉత్తేజం, నేర్చుకోవాలన్న ఉత్సుకత కలగడంతో.. మరో 39 స్కూళ్లకు దీన్ని విస్తరించాం. ‘అలెక్సా’ అంటే వాళ్లకో ఫీచర్ మాత్రమే కాదు.. లెర్నింగ్ డివైజ్ అంతకన్నా కాదు. వారికో స్నేహితుడు’ అని చెప్పారు. ‘అలెక్సా.. ఓ స్నేహితుడు, ఓ టీచర్.. ఇప్పుడు బస్తర్‌లోని పిల్లలు ఎలా డిజిటల్ రివల్యూషన్‌లోకి మారిపోయారో ఒకసారి చూడండి’ అనే క్యాప్షన్ పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ కూడా దీన్ని రీట్వీట్ చేశారు.