- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేత్తడికి తెలంగాణ ప్రభుత్వం అరుదైన అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో ‘దేత్తడి హారిక’ ఛానల్ ద్వారా అందరికీ సుపరిచయమైన అలేఖ్య హారిక.. తన వీడియోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనతో, తన మార్క్ కామెడీతో అభిమానులను అలరించింది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన హారికకు బిగ్‌బాస్ 4లో ఆఫర్ రాగా.. అందులోనూ తన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించింది.
ఈ క్రమంలో తాజాగా దేత్తడి హారికకు తెలంగాణ ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ మేరకు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఆమెకు ఇవాళ నియామక పత్రాన్ని అందించారు.
ఈ అవకాశం దక్కడంపై దేత్తడి హారిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. దీనిపై దేత్తడి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.