- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 ఏళ్లకు ముందే పెళ్లా? మూర్ఖత్వమే : యంగ్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యంగ్ హీరోయిన్, మోడల్ పూజా బేడీ కూతురు అలయ ఎఫ్ ‘జవానీ జానేమన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. సింగిల్ మదర్ పెంపకం ఎలా ఉంటుందన్న విషయంపై ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. అందరి పేరెంట్స్‌లా కాకుండా తన అమ్మానాన్న ఇద్దరూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించే ఎక్కువగా మాట్లాడతారని తెలిపింది. కాబట్టి ఆటోమేటిక్‌గా తమపై కూడా ఆ ప్రభావం ఉందని చెప్పింది. ఇండియాలో నార్మల్‌గా తల్లిదండ్రులు అందరూ పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేయాలని ఆరాటపడుతుంటారని.. కానీ తమ పేరెంట్స్ అందుకు పూర్తిగా విరుద్ధమని తెలిపింది. 30 ఏళ్ల వయసుకు ముందే పెళ్లి చేసుకోవడం కన్నా మూర్ఖమైన పని మరొకటి లేదని, ముందుగా కెరియర్ అండ్ వర్క్‌పై ఫోకస్ చేయాలని చెప్తుంటారని.. నీకు నువ్వుగా బిల్డ్ అవ్వాలని సూచిస్తారని చెప్పుకొచ్చింది.
కాగా తన ఐదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు పూజా బేడి, ఫర్హాన్ ఫర్నిచర్‌వాలా విడిపోయినా సరే.. బాల్యం మాత్రం చాలా హ్యాపీగా గడపిందని అలయ చాలా సందర్భాల్లో చెప్పింది. తన పేరెంట్స్ కేవలం డైవర్స్ మాత్రమే తీసుకున్నారని.. పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నారని తెలిపింది. మాకు ఒక బాధ కలిగించే విషయం జరిగిందన్న ఫీలింగ్ ఎప్పుడూ రానివ్వలేదంది అలయ.