- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాది వరకు కష్టమే : అక్తర్
ప్రస్తుతం కొవిడ్-19 సంక్షోభం నుంచి యావత్ ప్రపంచం బయటపడాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని.. అప్పటి వరకు క్రికెట్ సహా ఇతర క్రీడలు ఆడటం కష్టమేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. ‘ప్రజలు మామూలు స్థితికి చేరుకోవడానికే చాలా కాలం పడుతుంది. అలాంటప్పుడు ఏడాది వరకు క్రీడలు ఆరంభమయ్యే అవకాశమే లేదని’ చెప్పాడు. ‘వైరస్ తీవ్రత పెరిగినప్పటి నుంచి ప్రపంచం లాక్‌డౌన్‌లోనే ఉంది.. మొదటి రోజు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మనం క్రికెట్ గురించి ఆలోచించగలమా’ అని అక్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సంక్లిష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని.. క్రీడాకారులు మనోనిబ్బరాన్ని కోల్పోవద్దని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సూచించాడు. ఇక ఫీల్డ్‌లో బౌలర్లు.. బంతికి ఉమ్మి రాసేందుకు బదులుగా ఐసీసీ మరో ప్రత్యామ్నాయం చూపాలని కోరాడు. ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని తెలిపాడు.
Tags: Covid-19, Shoaib Akhtar, Pakistan, One year postponed, ICC