‘అక్షర’ ట్రైలర్.. విద్య వ్యాపారంగా ఎందుకు మారుతోంది?

by Jakkula Samataha |
‘అక్షర’ ట్రైలర్.. విద్య వ్యాపారంగా ఎందుకు మారుతోంది?
X

దిశ, సినిమా : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అక్షర’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. చిన్నికృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుండగా.. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ‘విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు.. విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు. అఖిల విశ్వాన్ని శాసించే ఆదిశక్తి అక్షరమే’ అన్న డైలాగ్స్ ఆకట్టుకుంటుండగా.. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కార్పొరేట్ సంస్థలకు, అక్షర అనే టీచర్‌కు మధ్య జరిగిన పోరాటమే సినిమా. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్లలో , కాలేజీల్లో జాయిన్ చేశామని అందరికీ చెప్పుకుని ఆనందపడుతుంటారు. కానీ ఆ కాలేజీల్లో పిల్లలు ఎలా నలిగిపోతున్నారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. ఓ విద్యార్థిని హత్య చుట్టూ సినిమా కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుండగా.. అమ్మాయి తండ్రిగా హర్ష, ఎడ్యుకేషనల్ మాఫియాను నడిపించే వ్యక్తిగా సంజయ్ స్వరూప్, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శత్రు నటిస్తున్నారు.

Advertisement

Next Story