మానసిక రోగులకు అక్షర హెల్ప్

by Shyam |
మానసిక రోగులకు అక్షర హెల్ప్
X

దిశ, వెబ్ డెస్క్: అక్షర హాసన్ ఈ నెల 12న తన పుట్టినరోజును పురస్కరించుకుని మానసికంగా అనారోగ్యంగా ఉన్నవారికి సపోర్ట్ చేస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపింది. ద బన్యన్ అనే స్వచ్ఛంధ సంస్థ మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వారికి ఆశ్రయం కల్పించి ఆదుకుంటుండగా.. ఆర్గనైజేషన్‌ ద్వారా సేవలు కొనసాగిస్తుంది. కరోనా కారణంగా దాదాపు ఆరునెలలుగా దాదాపు అందరం కష్టాలు పడ్డామని..బాధ, దు:ఖం, డిప్రెషన్‌ను లాంటివి ఎదుర్కొన్నామని అక్షర తెలిపింది. ఇలాంటి సమయంలో ఫిజికల్ హెల్త్‌తోపాటు మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని ఆమె పేర్కొంది.

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న లక్షల మందికి ద బన్యన్ అనే స్వచ్చంధ సంస్థ సహాయం చేస్తుందని చెప్పింది. ఆశ్రయం కల్పించి, భోజనం అందించడంతోపాటు ఉద్యోగం కూడా ఇప్పిస్తున్నట్లు తెలిపింది. అలాంటి స్వచ్చంధ సంస్థ మరింత మందికి సహాయం చేయాలంటే మన వంతు బాధ్యతగా విరాళం అందించాలని కోరింది. మీకు తోచినంత సహాయం చేయాలని..మీరు అందించే సహాయం చిన్నదైనా చాలా విలువైనదని గుర్తుంచుకోవాలంది. అందరం కలిసి ప్రతీ ఒక్కరి కోసం ముందుందామని.. గ్రేటర్, బ్రైటర్ ఫ్యూచర్ కోసం ప్రయత్నిద్దామని కోరింది. ప్రస్తుతం అక్షర ‘అచ్చమ్ మాదమ్ నానమ్ పయిర్పు’ చిత్రంతో బిజీగా ఉండగా..2న ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా..సినిమాపై అంచనాలు పెంచేసింది.

Advertisement

Next Story