- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అజయ్ దేవగన్.. హిందీ 'ఖైదీ' ?
దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో కార్తి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కైథీ’. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్. ముందుగా ఈ సినిమాలో కార్తి పాత్రలో నటించేందుకు హృతిక్ రోషన్‌ను ఎంచుకున్నా అది వర్కౌట్ కాలేదు. తర్వాత సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినా లాభం లేకుండాపోయింది. దీంతో అజయ్ దేవగన్‌కు ఈ ఛాన్స్ వెళ్లిందట. ఇప్పటికే తమిళ్ ‘కైథీ’ మూవీ చూసిన అజయ్ ఇంప్రెస్ అయ్యాడట. కార్తి రోల్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడట. అయితే నిర్మాణ సంస్థలతో డీల్ ఓకే అవగానే వెంటనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందట.
అజయ్ దేవగన్ ప్రస్తుతం అమిత్ శర్మా ‘మైదాన్’, రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు ‘భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ కథ నచ్చడం, యాక్టింగ్‌కు స్కోప్ ఉండడంతో బిజీ షెడ్యూల్స్‌లోనూ సినిమాకు ఓకే చెప్పారట. డేట్స్ సర్దుబాటు చేసుకుని ‘కైథీ’ రీమేక్‌లో జాయిన్ అవుతాడట.
కాగా.. తెలుగులో ‘ఖైదీ’గా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్‌హిట్ అయింది. డ్రగ్స్ మాఫియా నుంచి సరుకు స్వాధీనం చేసుకున్న పోలీసులు… మాఫియా వెంటాడుతుండడంతో ఖైదీ(కార్తీ) సహాయాన్ని కోరుతారు? కానీ, ఆ హెల్ప్ చేయాలంటూ తన బిడ్డను చూసేందుకు అనుమతివ్వాలని కోరుతాడు ఖైదీ? తన కూతురును తొలిసారిగా చూసేందుకు వెళ్లడం… ఆ ఆరాటంలో ఎదురయ్యే సన్నివేశాలు? అటు మాఫియా వెంటాడడంతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కార్తి క్లైమాక్స్‌లో తన బిడ్డను చూసినప్పుడు చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.109 కోట్లు కలెక్ట్ చేసింది.