ఐశ్వర్యారాయ్ ఆ ఫొటో లీక్.. వైరల్ చేస్తున్న నెటిజన్లు

by Shyam |   ( Updated:2021-08-24 07:09:26.0  )
aishwarya-rai
X

దిశ, సినిమా : హిస్టారికల్ ఫిక్షన్ నవల ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పీరియాడిక్ డ్రామా నుంచి అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా.. ఇందులో ఐశ్వర్య డబుల్ రోల్ పోషిస్తుండటం విశేషం. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో షూటింగ్‌ పూర్తిచేసుకుని ముంబైకి తిరిగిరాగా.. ఐశ్వర్య రాయల్ అవతార్‌ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు సంబంధించిన పిక్ అంటూ నెటిజన్లు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఫొటోలో ట్రెడిషనల్ రెడ్ శారీ ధరించిన ఐశ్వర్య.. ఒంటినిండా ఆభరణాలతో అచ్చం మహారాణిని తలపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో తను నటిస్తున్న విషయాన్ని ఐశ్వర్య జులై 19న అఫీషియల్‌గా ప్రకటించింది.

https://twitter.com/Gokila81197469/status/1430036135929995264?s=20

Advertisement

Next Story

Most Viewed