- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టారిఫ్ రేట్లను పెంచే పనిలో టెలికాం కంపెనీలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీలు (Domestic telecom companies) ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(Airtel, Vodafone Idea)లు సెప్టెంబర్ నుంచి టారిఫ్ (Tariff రేట్లను పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక డేటా, కాలింగ్ ప్లాన్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి.
మార్పులు చేసే కొత్త రేట్లను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి అమల్లో తీసుకురానున్నాయి. కేంద్రానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఈ బకాయిల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ, సుప్రీంకోర్టు (Supreme Court)అనుమతించలేదు.
గతేడాది భారత్‌లోని అన్ని టెలికాం కంపెనీలు (Telecom companies) వివిధ ప్లాన్ల ధరలను 10 నుంచి 40 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితుల్లో మరిన్ని మార్పులు రావడంతో రెవెన్యూ కార్యకలాపాలు (Revenue activities) కొనసాగటానికి టారిఫ్ ధరలను పెంచక తప్పదని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Airtel, Vodafone Idea) కంపెనీలు భావిస్తున్నట్టు చెబుతున్నాయి. అయితే, ఈ అంశంపై వొడాఫోన్ ఐడియా ప్రతినిధి ఇవి ఊహగానాలు మాత్రమే అని చెప్పగా, ఎయిర్‌టెల్ ఇంకా స్పందించలేదు.