మరో మైలురాయి సాధించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్!

by Harish |
airtel
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లో మొత్తం 100 కోట్ల లావాదేవీల మార్క్‌ను అధిగమించింది. అంతేకాకుండా సమీక్షించిన కాలంలో లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 61 శాతం పెరిగాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే 5 లక్షలకు పైగా బ్యాంకింగ్ పాయింట్లతో వేగంగా విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులు భారీగా పెరగడమే దీనికి కారణమని, అయితే ఆ తర్వాత చెల్లింపుల పరిమాణం స్థిరంగా కొనసాగుతోందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వివరించింది.

ఈ క్రమంలోనే 100 కోట్ల లావాదేవీల మైలురాయిని అధిగమించినట్లు తెలిపింది. యూపీఐ చెల్లింపు, ఫాస్టాగ్, యుటిలిటీ, మొబైల్, డీటీహెచ్ రీఛార్జ్‌లు సహా ఇతర డిజిటల్ లావాదేవీలు దీనికి ఎంతో దోహదం చేశాయని కంపెనీ అభిప్రాయపడింది. ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ పట్టణ ప్రంతాల్లో డిజిటల్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు లేని వినియోగదారులకు అందుబాటులో ఉంది. సంస్థ అందించే సేవలను వినియోగదారులు ఆదరిస్తున్నారు. దీనివల్లే లక్షల కొద్దీ కస్టమర్లను మా డిజిటల్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురాగలిగామ’ని కంపెనీ సీఈఓ అనుబ్రత బిశ్వాస్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed